‘క్షమించండి.. నా మాజీ భర్త గురించే అలా మాట్లాడాను’

Published on Mon, 02/02/2026 - 18:11

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. పురుషులందరినీ తక్కువ చేసేలా తాను మాట్లాడానంటూ వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. అసలేం జరిగిందంటే...

విడాకులు.. వివాదాలు
గత కొన్ని రోజులుగా మేరీ కోమ్‌ (Mary Kom) వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేరీ కోమ్‌- కరుంగ్‌ ఓన్‌కోలర్‌ కోమ్‌ అనూహ్య రీతిలో విడిపోవడం.. అనంతరం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇందుకు కారణం.

గల్లీల్లో చాలా మంది ఉన్నారు
విడాకుల గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న మేరీ కోమ్‌.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కోసం కెరీర్‌ త్యాగం చేశానని కరుంగ్‌ అంటున్నాడని.. దేశంలో గల్లీల్లో చాలా మంది ఫుట్‌బాల్‌ ఆడుతుంటారని ఎద్దేవా చేశారు.

సంపాదన లేని భర్త
అంతేకాదు.. కరుంగ్‌ చిల్లగవ్వ కూడా సంపాదించలేదని.. తనపై ఆధారపడి బతికాడని మేరీ కోమ్‌ తన మాజీ భర్తను నిందించారు. ఈ నేపథ్యంలో కరుంగ్‌ సైతం ఘాటుగా స్పందించాడు. తన భార్య బాక్సింగ్‌ ప్రయాణం సజావుగా సాగేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను వదిలేశానని చెప్పాడు.

సంచనల ఆరోపణలు
నలుగురు పిల్లల ఆలనాపాలనా కూడా తానే చూసుకొన్నానని.. ఇంటి బాధ్యతలన్నీ తానొక్కడినే నెరవేర్చానని కరుంగ్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. గతంలో ఓ జూనియర్‌ బాక్సర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన మేరీ కోమ్‌.. ఆ తర్వాత తమ అకాడమీలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. వారిద్దరి వాట్సాప్‌ చాట్లు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడు

అయితే, మేరీ కోమ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్లు, భార్య కెరీర్‌లో ఎదిగేందుకు వీలుగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భర్తలను తక్కువ చేసి మాట్లాడిందంటూ భారీ ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్‌ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

హుందాగానే ప్రవర్తించాను
‘‘నా పెళ్లి పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చిందని నేను చెప్పను. చాలా ఏళ్ల పాటు అంతా సజావుగా సాగిపోయింది. అయితే, ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత అంతా మారిపోయింది 2025 ఏప్రిల్‌లో నా విడాకుల గురించి ప్రకటించినపుడు కూడా నాకై నేను నేరుగా మీడియాతో మాట్లాడలేదు

ఎల్లప్పుడూ నేను హుందాగానే ప్రవర్తించాను. నా మాటలు సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. ఇది దురదృష్టకరం. యూత్‌ ఫుట్‌బాల్‌కు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. ఫుట్‌బాల్‌ సంస్కృతిని నేను కించపరచలేదు.

నేనొక బాక్సర్‌ని. అయినప్పటికీ నాకు ఫుట్‌బాల్‌ ఆడటం అంటే ఎంతో ఇష్టం. నా వ్యాఖ్యలతో క్రీడలను, క్రీడాకారులను కించపరచాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం గల్లీ నుంచే మొదలవుతుంది. కఠిన శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సునిల్‌ ఛెత్రి, భాయ్‌చుంగ్‌ భుటియా లాంటి వాళ్లు పుట్టుకొస్తారు.

పురుష సమాజానికి క్షమాపణలు
నా కోసం తన కెరీర్‌ త్యాగం చేశానని నా మాజీ భర్త అన్నాడు. అతడు షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్‌ ఆడేవాడు. ఆ తర్వాత ఆటను వదిలేసి ఢిల్లీకి వచ్చిన తర్వాతే నన్ను కలిశాడు అదే విధంగా.. నా భర్తకు సంపాదన లేదని నేను అన్న మాటలను.. పురుష సమాజాన్ని కించపరచాలని మాట్లాడినట్లు అన్వయించుకుంటున్నారు.

నా ఈ మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇది కేవలం మా మధ్య జరిగిన విషయానికి సంబంధించినది మాత్రమే. చాలా ఏళ్ల పాటు అనుభవించిన బాధ, డిప్రెషన్‌.. ద్రోహం కారణంగా నాలో పెల్లుబుకిన అసహనం అది. అంతేకానీ మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు’’ అని మేరీ కోమ్‌ స్పష్టతనిచ్చారు.

చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)