Breaking News

వందో టెస్ట్‌కు ముందు మనసులో మాట బయటపెట్టిన పుజారా

Published on Thu, 02/16/2023 - 16:11

BGT 2023: కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడే ముందు టీమిండియా టెస్ట్‌ క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా తన మనసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌కు ముందు పుజారా చాలా విషయాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు. 13 ఏళ్ల తన కెరీర్‌లో అనుభవాలను వివరిస్తూ వచ్చిన నయా వాల్‌.. తన అత్యుత్తమమైన ప్రదర్శనలు, ధీటైన ప్రత్యర్ధి, కఠినమైన బౌలర్‌, తన చిరకాల కోరిక.. ఇలా చాలా విషయాలను పంచుకున్నాడు.

టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ గెలవడమే తన కల అని మనసులో మాటను బయటపెట్టిన పుజారా.. ధీటైన ముగ్గురు ప్రత్యర్ధుల్లో మొదటిది ఆసీస్‌, రెండో జట్టు ఇంగ్లండ్‌, మూడో టీమ్‌ న్యూజిలాండ్‌ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో జిమ్మీ ఆండర్సన్‌ పేరును తొలుత ప్రస్తావించిన పుజారా.. డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, పాట్‌ కమిన్స్‌ల పేర్ల చెప్పాడు.

తన అత్యుత్తమ ప్రదర్శన గురించి పుజారా మాట్లాడుతూ.. అరంగేట్రంలో ఆసీస్‌పై చేసిన 72 పరుగులకు ఫస్ట్‌ ర్యాంక్‌ ఇచ్చాడు. ఆతర్వాత చెన్నైలో ఆసీస్‌పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్‌కు, ఆతర్వాత జొహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాపై చేసిన 123 పరుగుల ఇన్నింగ్స్‌కు, అలాగే గత ఆసీస్‌ పర్యటనలో గబ్బా టెస్ట్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లు అత్యుత్తమమైనవిగా చెప్పుకొచ్చాడు. 

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌ పుజారా కెరీర్‌లో వందో టెస్ట్‌ కానున్న విషయం తెలిసిందే. భారత్‌ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్‌లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.

ప్రస్తుతం టెస్ట్‌ క్రికెట్‌ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్‌ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు 105 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు.  
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)