చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీం.. వరల్డ్‌ రికార్డు బద్దలు

Published on Wed, 06/18/2025 - 18:56

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీం (Mushfiqur Rahim) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా స్టార్‌ ​ఆడం గిల్‌క్రిస్ట్‌ (Adam Gilchrist) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క బంతి కూడా వేయకుండానే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక (Ban Vs SL)తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లాం (14), అనాముల్‌ హక్‌ (0) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌ (29) కూడా నిరాశపరిచాడు. దీంతో కష్టాల్లో చిక్కుకున్న జట్టును కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (148), ముష్ఫికర్‌ రహీం కలిసి గట్టెక్కించారు.

కాగా తొలిరోజు ఆటలో భాగంగా 105 పరుగులు చేసిన ముష్ఫికర్‌ రహీం.. బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 150 పరుగుల మార్కును అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 350 బంతులు ఎదుర్కొని 163 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి ముష్ఫికర్‌ రహీం.. 15,502 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఒక్క బాల్‌ కూడా బౌల్‌ చేయకుండానే అతడు ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా వేయకుండానే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అతడు ప్రపంచ రికార్డు సాధించాడు.

అంతకు ముందు ఈ రికార్డు ఆడం గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉండేది. అతడు తన కెరీర్‌లో ఒక్క బంతి కూడా వేయకుండా 15,461 పరుగులు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క బంతి కూడా బౌల్‌ చేయకుండానే అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు వీరే
1. ముష్ఫికర్‌ రహీం- బంగ్లాదేశ్‌- 15,502 రన్స్‌
2. ఆడం గిల్‌క్రిస్ట్‌- ఆస్ట్రేలియా- 15461 రన్స్‌
3. క్వింటన్‌ డికాక్‌- సౌతాఫ్రికా- 12,654 రన్స్‌
4. జోస్‌ బట్లర్‌- ఇంగ్లండ్‌- 11,881 రన్స్‌
5. జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్‌- 11,581 రన్స్‌

పటిష్ట స్థితిలో
ఇక బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో అత్యధికసార్లు 150కి పైగా స్కోర్లు సాధించిన క్రికెటర్‌గానూ ముష్ఫికర్‌ రహీం కొనసాగుతున్నాడు. అతడు ఏడుసార్లు ఈ ఫీట్‌ నమోదు చేయగా.. మొమినుల్‌ హక్‌ మూడుసార్లు 150కి పైగా స్కోర్‌ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. షాంటో, ముష్ఫికర్‌లతో పాటు లిటన్‌ దాస్‌ (123 బంతుల్లో 90) కూడా రాణించడంతో బంగ్లాదేశ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 484 పరుగులు సాధించింది.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)