Breaking News

దారుణంగా విఫలమైన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌

Published on Sun, 06/08/2025 - 17:02

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్‌ ఖాన్‌.. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లో దారుణంగా విఫలమవుతున్నారు. ఐపీఎల్‌ తర్వాత మొదలైన ఈ లీగ్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లు ఆడిన ముషీర్‌ 16.50 సగటున కేవలం 66 పరుగులే చేశాడు. ముంబై టీ20 లీగ్‌లో అంధేరికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్‌.. ఇవాళ (జూన్‌ 8) థానే స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 7 బంతుల్లో 4 పరగులు మాత్రమే చేసి ఔటయ్యారు. 

ఐపీఎల్‌ 2025 ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన ముషీర్‌.. ఆ మ్యాచ్‌లో (ఆర్సీబీ) డకౌటయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో ముషీర్‌ బంతితో ఆకట్టుకున్నాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఓ వికెట్‌ తీశాడు.

20 ఏళ్ల ముషీర్‌ ఖాన్‌పై ముంబై టీ20 లీగ్‌లో భారీ అంచనాలు ఉండేవి. అయితే అతను 5 ఇన్నింగ్స్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియా బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడైన ముషీర్‌కు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 51.14 సగటున 716 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. థానే స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అంధేరి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ముషీర్‌ ఖాన్‌ విఫలం కాగా.. మరో ఓపెనర్‌ హర్వాద్కర్‌ 40 పరుగులతో రాణించాడు. 

హర్కాద్కర్‌.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రసాద్‌ పవార్‌తో (57) కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. వీరిద్దరు ఆడకపోయుంటే అంధేరి ఈ మాత్రం స్కోర్‌ కూడా చేయలేకపోయేది. మోనిల్‌ సోని, నౌషద్‌ అహ్మద్‌ డకౌట్‌ కాగా.. ప్రజ్ఞేశ్‌ 10, తివారి 14 (నాటౌట్‌), ఓంకార్‌ జాదవ్‌ 3 (నాటౌట్‌) పరుగులు చేశారు. థానే బౌలర్లలో శశాంక్‌ అట్టర్డే 3, అంకుర్‌ సింగ్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన థానే.. 2.5 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది. వరున్‌ లవండే 6 పరుగులకు ఔట్‌ కాగా.. అనిశ్‌ ముకుంద్‌ 15, అజిత్‌ యాదవ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. మోనిల్‌ సోనికి ఓ వికెట్‌ దక్కింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)