Breaking News

సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్‌లో టీమిండియా యువ సంచలనం ఆల్‌రౌండ్‌ షో

Published on Tue, 07/01/2025 - 21:18

ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు ముషీర్‌ ఖాన్‌ ఇరగదీస్తున్నాడు. నాట్స్‌ సెకెండ్‌ 11తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ సహా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.  ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ తమ ఎమర్జింగ్‌ టీమ్‌తో ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. ముషీర్‌ ముంబై టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన ముషీర్‌.. తొలి ఇన్నింగ్స్‌లోనే బ్యాట్‌తో, బంతితో సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, ఆతర్వాత బంతితో 'ఆరే'శాడు.

ముషీర్‌ ఖాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతనాడిన ఏకైక మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచాడు. ఆర్సీబీతో జరిగిన తొలి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ముషీర్‌ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ముషీర్‌ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్‌ అగర్వాల్‌ వికెట​ పడగొట్టాడు.

20 ఏళ్ల ముషీర్‌ ఖాన్‌ టీమిండియా అప్‌ కమింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది. 

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముషీర్‌ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్‌ 2024 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్‌ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్‌.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)