Breaking News

Rohit Sharma: రోహిత్‌ శర్మకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Published on Sat, 09/18/2021 - 13:50

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఆ జట్టు ఆటగాళ్లు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ అనంతరం యూఏఈకి చేరుకున్న రోహిత్‌ శర్మ ఆరు రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. తాజాగా శనివారంతో క్వారంటైన్‌ పీరియడ్‌ కంప్లీట్‌ చేసుకున్న రోహిత్‌ జట్టు సభ్యులతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌కు హగ్గులతో పాటు బెస్ట్‌ విషెస్‌ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: Dinesh karthik: బౌలర్‌ యార్కర్‌ దెబ్బ..  క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్‌మన్‌

'' మా కెప్టెన్‌కు ఇదే వెల్‌కమ్‌.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ ఫ్రమ్‌ టీమ్‌మేట్స్‌'' అని క్యాప్షన్‌ జత చేసింది. కాగా టి20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కోహ్లి టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కాగా కోహ్లి స్తానంలో రోహిత్‌ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు రోహిత్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌ రెండో అంచె పోటీల్లో తన తొలి మ్యాచ్‌ను రేపు (సెప్టెంబర్‌ 19న) సీఎస్‌కేతో తలపడనుంది.

ఇక రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ఇక ఈ సీజన్‌లోనూ ముంబై నిలకడ ఆటతీరును కనబరుస్తుంది. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం

NZ Vs Pak Series Cancellation: కివీస్‌ సిరీస్‌ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)