ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజ‌రాత్‌

Published on Mon, 04/20/2026 - 23:29

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. 

వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. 

టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ (101 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం చెల‌రేగ‌గా,  న‌మ‌న్ ధిర్ (45) బాధ్య‌తాయుతంగా ఆడారు. గుజ‌రాత్‌బౌల‌ర్ల‌లో ర‌బాడ 3 వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచ‌రీతో చెల‌రేగిన తిల‌క్ వ‌ర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 

సీజ‌న్‌లో రెండో విజ‌యం సాధించిన ముంబై 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి ఎగ‌బాకింది. మ‌రోవైపు గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌తో ప‌ట్టిల‌క‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

 

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)