ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్పు.. కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌

Published on Thu, 09/25/2025 - 15:04

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక మార్పు చేసింది. రెండు టైటిళ్లు గెలిపించిన చార్లెట్ ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా కైట్‌లీని (Lisa Keightley) హెడ్‌ కోచ్‌గా నియమించింది. 

చార్లెట్ ఇంగ్లండ్‌ జాతీయ మహిళల జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నేపథ్యంలో గత కొంతకాలంగా ఎంఐ హెడ్‌ కోచ్‌ పదవి ఖాళీగా ఉంది.  

54 ఏళ్ల లిసా తన కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 92 మ్యాచ్‌లు (9 టెస్ట్‌లు, 82 వన్డేలు, 1 టీ20) ఆడారు. 1997, 2005 ప్రపంచకప్ విజేత జట్టులో భాగమయ్యారు. ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ జట్లకు కోచ్‌గా సేవలందించారు.

తాజాగా ఆమె నార్తర్న్ సూపర్‌చార్జర్స్ (Women's Hundred League) విజేతగా నిలిపారు. లిసాకు మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో (WBBL) సిడ్నీ థండర్‌కు కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది.

ఎంఐ హెడ్‌ కోచ్‌గా ఎంపికైన అనంతరం లిసా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌ లాంటి అద్బుతమైన ఫ్రాంచైజీలో భాగం కావడం గర్వంగా ఉంది. WPLలో బెంచ్‌మార్క్ సెట్ చేసిన జట్టుతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు WPL సీజన్లలో రెండు టైటిళ్లు (2023, 2025) గెలిచింది. 2024 ఎడిషన్‌లో మాత్రం ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. గెలిచిన రెండు సీజన్లలో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌లో ఓడించింది. 2026 ఎడిషన్‌లో లిసా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి టైటిల్ కోసం పోరాడనుంది.

చదవండి: BCCI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)