Breaking News

విరాట్‌ కోహ్లికి అవమానం.. 18 నంబర్‌ జెర్సీ మరొకరికి కేటాయింపు

Published on Sun, 06/01/2025 - 19:06

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్‌ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత విరాట్‌ జెర్సీ నంబర్‌ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్‌ కుమార్‌ 18 నంబర్‌ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్‌కు ఈ జెర్సీ నంబర్‌ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్‌ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్‌ చేస్తున్నారు.

క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్‌ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. 

టెస్ట్‌ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్‌ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్‌ చాలాకాలం పాటు నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగింది. విరాట్‌ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్‌కు‌ టెస్ట్‌ల్లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది.

అలాంటి విరాట్‌కు టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించినా సంబంధిత క్రికెట్‌ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్‌లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. 

విరాట్‌ జెర్సీ నంబర్‌ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్‌కు విరాట్‌ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం​ కనీస ధర్మమని అంటున్నారు.

ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. 

ఈసారి టైటిల్‌ సాధించి ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలకాలని విరాట్‌ భావిస్తున్నాడు. జూన్‌ 3న ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ జరుగుతుంది. ఇవాళ (జూన్‌ 1) జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో (ముంబై వర్సెస్‌ పంజాబ్‌) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)