Breaking News

ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్‌ కొట్టినా ఔటైపోయాడు!

Published on Mon, 09/04/2023 - 07:42

ఆసియాకప్‌-2023ను ఆఫ్గానిస్తాన్‌ ఓటమితో ఆరంభించింది. లహోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఓపెనర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్‌లో నజ్ముల్‌ హోసేన్‌ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు.

అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్‌ (74), కెపె్టన్‌ హష్మతుల్లా ( 51) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌ 4, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశారు. 

ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌ ఆటగాడు ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా ముజీబ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ 45 ఓవర్‌ వేసిన తస్కిన్ అహ్మద్‌ బౌలింగ్‌లో ముజీబ్‌ భారీ షాట్‌ ఆడాడు. దెబ్బకు బంతి స్టాండ్స్‌కు వెళ్లింది. కానీ ఇక్కడే అస్సలు ట్విస్టు చోటుచేసుకుంది.

బంతిని కొట్టి క్రమంలో ముజీబ్‌ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇది గమనించిన వికెట్‌ కీపర్‌ రహీమ్‌ ఔట్‌ అంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు కూడా సంబరాలు మునిగి తెలిపోయారు. పాపం ముజీబ్‌ సిక్స్‌ కొట్టి మరి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా ఈ  మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్‌ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును ఒకటి ముజీబ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్‌ నిలిచాడు.
చదవండి: వరుణుడు కరుణిస్తే!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)