Breaking News

రికార్డు విజయం.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన యూఏఈ

Published on Tue, 05/20/2025 - 07:18

క్రికెట్‌ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌ కోసం​ యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌.. తొలి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.

రాణించిన బంగ్లా బ్యాటర్లు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. టాపార్డర్‌ బ్యాటర్లు తంజిద్‌ హసన్‌ (59), లిటన్‌ దాస్‌ (40), నజ్ముల్‌ హసన్‌ షాంటో (27), తౌహిద్‌ హృదోయ్‌ (45), జాకిర్‌ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర​్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశారు.

యూఏఈని గెలిపించిన కెప్టెన్‌
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు. 

ఆఖర్లో ధృవ్‌ పరాషార్‌ (11), హైదర్‌ అలీ (15 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌, నహిద్‌ రాణా, రిషద్‌ హొసేన్‌ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)