Breaking News

CSK Vs MI: ధోని హ్యాట్రిక్‌ సిక్స్‌లు.. దద్దరిల్లిన స్టేడియం! వీడియో వైరల్‌

Published on Sun, 04/14/2024 - 22:02

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ క్రికెటర్‌ ఎంస్‌ ధోని మరోసారి ఫినిషర్‌ అవతరమెత్తాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని వరుసగా హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు.

తన ఎదుర్కొన్న తొలి బంతిని లాంగాఫ్‌ మీదగా భారీ సిక్సర్‌ బాదిన మిస్టర్‌ కూల్‌, ఆ తర్వాత బంతులను లాంగాన్‌, డీప్‌ స్వ్కెర్‌ లెగ్‌ దిశగా సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తలైవా.. మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ధోని సిక్స్‌లు కొట్టగానే స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లోపోయింది. ధోని బ్యాటింగ్‌ చూసి ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్‌ ఫినిషర్‌ అంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(66 నాటౌట్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(69) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. . ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు, కోయిట్జీ, శ్రేయస్‌ గోపాల్‌ తలా వికెట్‌ సాధించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)