Breaking News

CSK Vs GT: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వ‌య‌స్సులో క‌ళ్లు చెదిరే క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

Published on Tue, 03/26/2024 - 23:45

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.  చెపాక్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది.

గుజరాత్‌ బ్యాటర్లలో సాయిసుదర్శన్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్‌ రెహ్మన్‌, తుషార్‌ దేశ్‌పాండే, దీపక్‌ చాహర్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్‌ పడగొట్టాడు.  అంతమకుముందు బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 206 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ధోని సూపర్‌ క్యాచ్‌.. 
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని  తన వికెట్‌ కీపింగ్‌తో ఔరా అన్పించాడు. అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్‌ బ్యాటర్‌ విజయ్‌ శంకర్‌ను ధోని పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో డారిల్‌ మిచెల్‌ మూడో బంతిని విజయ్‌ శంకర్‌కు  ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు.

ఈ క్రమంలో విజయ్‌ శంకర్‌ వర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుత పులిలా డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)