Breaking News

రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!

Published on Sat, 05/06/2023 - 17:42

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. శనివారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్‌ డకౌట్‌ గాకా.. గత నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ వరుసగా 2,3,0,0 పరుగులు చేసి విఫలమయ్యాడు. 

కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌ ఉందని అభిమానులు పేర్కొనడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే..  ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ దీపక్‌ చహర్‌ వేశాడు. రోహిత్‌తో ధోని మైండ్‌గేమ్‌ ఆడాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌, స్లిప్‌, థర్డ్‌మన్‌లో ఫీల్డింగ్‌ను సెట్‌ చేశాడు.

ఆ తర్వాత చహర్‌ బంతి వేయడానికి ముందే ధోని స్టంప్స్‌ దగ్గరకు వచ్చాడు. సాధారణంగా ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసేటప్పుడు వికెట్‌ కీపర్‌ వికెట్లకు కాస్త దూరంగా ఉంటాడు.  కానీ ధోని మాత్రం బంతి వేయడానికి ముందే స్టంప్స్‌ దగ్గరకు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. కానీ ఊహించినట్లుగానే చహర్‌ స్లోబాల్‌ వేశాడు.

ఇక రోహిత్‌ ల్యాప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా వెళ్లడం.. అక్కడే ఉన్న జడ్డూ సింపుల్‌ క్యాచ్‌ తీసుకోవడం జరిగిపోయింది. ఇలా ధోని మైండ్‌గేమ్‌తో రోహిత్‌ను బుట్టలో వేసుకొని ఫలితం రాబట్టాడు. రోహిత్‌ ఔట్‌ను కామెంటేటర్‌లో ఎయిర్‌లో.. ధోని మాస్టర్‌మైండ్‌.. మంత్రం ఫలించింది అంటూ కామెంట్‌ చేయడం ఆసక్తి కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ధోని క్రేజ్‌.. ఐపీఎల్‌ ఫాలో అవుతున్నాడా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)