Breaking News

IPL 2024: ‘ధోని ఇంకో రెండేళ్లు ఆడతాడు’

Published on Tue, 03/05/2024 - 18:00

IPL 2024- Is this MS Dhoni's last IPL season?: మిస్టర్‌ కూల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌-2024 సీజన్‌లో ఆడతాడా? లేదా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈసారి కొత్త పాత్రలో నేను అంటూ ధోని కూడా టీజ్‌ చేయడంతో ఆటగాడిగా జట్టు నుంచి నిష్క్రమిస్తాడా అనే సందేహాలు మరింత బలపడ్డాయి.

తాజా ఎడిషన్‌లో మెంటార్‌గా ధోని కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో‌ సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి.

‘‘ధోని ఈసారి కచ్చితంగా ఆడతాడు. నాకు తెలిసి ఈ సీజన్‌ ముగిసిన తర్వాతే ఇక ముందు ఆడాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటాడు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. ధోని మరో రెండేళ్లపాటు ఆడతాడు. బ్యాటర్లైనా, బౌలర్లైనా తమ ఆటలో పస తగ్గినపుడే రిటైర్‌ అవ్వాలని భావిస్తారు.

మరి.. గతేడాది ఎంఎస్‌ ధోని ఎలాంటి షాట్లు బాదాడో చూశారు కదా! గంటకు 145 కిలో మీటర్ల వేగంతో సిక్స్‌లు కొట్టాడు. నెట్స్‌లోనూ భారీ షాట్లతో అలరించాడు’’ అని ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీపక్‌ చహర్‌ పేర్కొన్నాడు. కాగా 42 ఏళ్ల ధోని గతేడాది సీఎస్‌కేను రికార్డు స్థాయిలో ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. 

ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ
ఐపీఎల్‌ టి20 టోర్నీ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్, న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్‌ కాన్వే ఐపీఎల్‌ టోర్నీకి దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే ఎడమ బొటన వేలికి గాయంకాగా, ఈ వారంలో అతనికి శస్త్ర చికిత్స జరగనుంది. 

కాన్వే కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 9 అర్ధ సెంచరీలతో కలిపి 141.28 స్ట్రయిక్‌రేట్‌తో 924 పరుగులు సాధించాడు. 

చదవండి: IPL 2024: ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ చేరలేదంటే సిగ్గుచేటే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)