Breaking News

ధోని జెర్సీ నంబర్‌ ‘7’కు రిటైర్మెంట్‌: బీసీసీఐ

Published on Sat, 12/16/2023 - 04:22

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్‌లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్‌ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్‌ జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై  ‘7’ నంబర్‌ వాడేందుకు బోర్డు అనుమతించదు.

గతంలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్‌కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించింది. సచిన్‌ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ ‘10’ నంబర్‌ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ వేసుకున్న ‘23’ నంబర్‌ను కూడా అతని కెరీర్‌ తర్వాత చికాగో బుల్స్‌ టీమ్‌ రిటైర్మెంట్‌ ఇచ్చింది.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)