Breaking News

ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా!

Published on Fri, 04/21/2023 - 23:26

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్‌లో తమను ఓడించడం అంత సులువు కాదని సీఎస్‌కే మరోసారి నిరూపించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ సీఎస్‌కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్‌కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. డెవన్‌ కాన్వే 77 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.,

ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ధోనిని ఎస్‌ఆర్‌హెచ్‌ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, మయాంక్‌ డాగర్‌ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్దగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్‌ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్‌ ముగిసిదంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు.

గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ధోని సలహాలతోనైనా ఎస్‌ఆర్‌హెచ్‌లో మార్పు వస్తుందేమో.. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.'' అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది హ్యాట్రిక్‌ పరాజయం.

చదవండి: Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే

క్లాసెన్‌ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)