Breaking News

ద‌క్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్క‌టే మార్గం: మోర్కెల్

Published on Sat, 06/29/2024 - 17:19

టీ20 వ‌ర‌ల్డ్‌-2024 ఫైన‌ల్‌కు మరి కొన్ని గంట‌ల్లో తెరలేవ‌నుంది. ఈ మెగా ఈవెంట్ ఫైన‌ల్లో భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకున్నాయి.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి త‌మ 13 ఏళ్ల వ‌ర‌ల్డ్‌క‌ప్ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని భార‌త్ భావిస్తుంటే.. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాల‌న్న క‌సితో ఉంది. 

ఈ నేపథ్యంలో ద‌క్షిణాఫ్రికాకు ఆ జ‌ట్టు మాజీ పేస‌ర్ మోర్నే మోర్కెల్ కీల‌క సూచ‌న‌లు చేశాడు. ఫైన‌ల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాట‌ర్లు అతిగా ఆలోచించకూడదని మోర్క‌ల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ ఇద్ద‌రూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.

"బుమ్రా అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అత‌డిని ఎదుర్కొవ‌డం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే స‌త్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవ‌ర్ల‌లో కూడా అత‌డు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు.

ప‌వ‌ర్ ప్లేలో రెండు ఓవ‌ర్లు, త‌ర్వాత మ‌ళ్లీ ఆఖ‌రి ఓవ‌ర్ల‌లోనే బుమ్రా అటాక్‌లో వ‌స్తాడు. కాబ‌ట్టి మా జ‌ట్టుకు నేను ఇచ్చే స‌ల‌హా ఒక్క‌టే. మిడిల్ ఓవ‌ర్ల‌లో మా బ్యాట‌ర్లు బాగా రాణించి ప‌రుగులు చేప‌ట్టాలి. 

అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవ‌కాశ‌ముంటుంది. అయితే మిడిల్ ఓవ‌ర్ల‌లో భార‌త బౌల‌ర్ల‌ను ఎటాక్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవ‌ర్ల‌లో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అత‌డొక వికెట్ టేక‌ర్‌. త‌న బౌలింగ్‌తో మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేయ‌గల‌డు. క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను ఒత్త‌డిలోకి నెట్ట‌గ‌ల‌డు. 

కాబ‌ట్టి సౌతాఫ్రికా బ్యాట‌ర్లు ఒత్త‌డికి లోన‌వ్వ‌కుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే ద‌క్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోర్క‌ల్ పేర్కొన్నాడు. కాగా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా ఆడ‌టం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)