Breaking News

టీమిండియాకు కొత్త బౌలింగ్‌ కోచ్‌.. జై షా ప్రకటన

Published on Wed, 08/14/2024 - 16:14

టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్‌బజ్‌కు తెలిపాడు. మోర్కెల్‌ కాంట్రాక్ట్‌ సెప్టెంబర్‌ 1 నుంచి మొదలవుతుందని షా పేర్కొన్నాడు. కాగా, టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌కు తొలి అసైన్‌మెంట్‌ బంగ్లాదేశ్‌ సిరీస్‌ అవుతుంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో బంగ్లాదేశ్‌ రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల నుంచి మోర్నీ భారత బౌలింగ్‌ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.

ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఇటీవలే నియమితుడైన విషయం​ తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఛార్జ్‌ తీసుకున్నాడు. ఆ సిరీస్‌లలో భారత తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే వ్యవహరించాడు.

గంభీర్‌ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్‌ టీమ్‌లో ప్రస్తుతం అసిస్టెంట్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ ఉన్నారు. తాజాగా గంభీర్‌ తాను రెకమెండ్‌ చేసిన మోర్నీ మోర్కెల్‌కు భారత బౌలింగ్‌ కోచ్‌ పగ్గాలు అప్పజెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్‌, మోర్కెల్‌ గతంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే గంభీర్‌ మోర్కెల్‌ పేరును ప్రతిపాదించాడు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)