Breaking News

హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం

Published on Mon, 09/15/2025 - 19:29

భారత్‌-పాక్‌ ఆటగాళ్ల హ్యాండ్‌ షేక్‌ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు విషయాన్ని సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయాడని సొంత అధికారినే సస్పెండ్‌ చేసింది. జట్టు క్రికెట్‌ ఆపరేషన్ష్‌ డైరెక్టర్‌ ఉస్మాన్‌ వాహ్లాపై పీసీబీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అధ్యక్షుడు నఖ్వీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి వాహ్లాను ఫైర్‌ చేశాడని తెలుస్తుంది.

ఈ విషయాన్ని హ్యాండిల్‌ చేసే విషయంలో వాహ్లా నుంచి ఎక్కువగా ఆశించాము.  అయితే అతను నిరాశపరిచాడు. వాహ్లా కారణంగా భారత్‌ ముందు పాక్‌ పరువు పోయింది. టాస్‌కు ముందే మ్యాచ్ రిఫరీ కరచాలనం విషయాన్ని ప్రస్తావించినా, వాహ్లా పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యాడని నఖ్వీ అన్నట్లు సమాచారం​.

కాగా, ఆసియా కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వని విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌-4 దశ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు నో హ్యాండ్‌షేక్‌ పాలసీని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై పీసీబీ ఇప్పటికే నానా యాగీ చేస్తుంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారికి తగని నీతులు చెబుతుంది.

ఐసీసీ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే యూఏఈతో తదుపరి జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఐసీసీ మాత్రం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం అన్నది ఆటగాళ్ల వ్యక్తిగతం అంశమని లైట్‌ తీసుకుంది. పీసీబీ మాత్రం భారత్‌ ముందు తమ పరువు పోయిందని ఐసీసీ ముందు గగ్గోలు పెడుతుంది. 
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)