Breaking News

చరిత్ర సృష్టించిన మోనాంక్‌ పటేల్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో అత్యధిక స్కోర్‌

Published on Thu, 06/19/2025 - 10:20

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ఆటగాడు మోనాంక్‌ పటేల్‌ చరిత్ర సృష్టించాడు. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 19) సియాటిల్‌ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగులు (50 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసిన అతను.. ఈ లీగ్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన అమెరికన్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కోరె ఆండర్సన్‌ పేరిట ఉండేది. 

2023 ఎడిషన్‌లో ఆండర్సన్‌ శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌పై అజేయమైన 91 పరుగులు (52 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. ఎంఎల్‌సీలో అత్యధిక పరుగులు చేసిన అమెరికన్‌ ఆటగాళ్ల జాబితాలో మోనాంక్‌, ఆండర్సన్‌ తర్వాతి స్థానాల్లో సంజయ్‌ కృష్ణమూర్తి (79 నాటౌట్‌), ఉన్ముక్త్‌ చంద్‌ (68) ఉన్నారు.

ఓవరాల్‌గా ఎంఎల్‌సీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన రికార్డు ఫిన్‌ అలెన్‌ పేరిట ఉంది. అలెన్‌ ఇదే సీజన్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంపై 151 పరుగులు (51 బంతుల్లో) చేశాడు. ఎంఎల్‌సీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు నికోలస్‌ పూరన్‌ పేరిట ఉంది. పూరన్‌ 2023 ఎడిషన్‌లో అజేయమైన 137 పరుగులు చేశాడు. 

అలెన్‌, పూరన్‌ తర్వాతి స్థానాల్లో క్లాసెన్‌ (110 నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ (106 నాటౌట్‌), రికెల్టన్‌ (103 నాటౌట్‌), ఫిన్‌ అలెన్‌ (101), డుప్లెసిస్‌ (100) ఉన్నారు. పైన పేర్కొన్న ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకే ఎం​ఎల్‌సీలో సెంచరీలు చేశారు. ఇందులో అలెన్‌ ఒక్కడు రెండు సెంచరీలు చేశాడు. 

ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సియాటిల్‌ ఓర్కాస్‌పై ఎంఐ న్యూయార్క్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మోనాంక్‌ పటేల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ (93) ఆడి ఎంఐను గెలిపించాడు. మోనాంక్‌కు మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (35 బంతుల్లో 50 నాటౌట్‌), కీరన్‌ పోలార్డ్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌) తోడవ్వడంతో ఓర్కాస్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంఐ న్యూయార్క్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది.

అంతకుముందు కైల్‌ మేయర్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (46 బంతుల్లో 88) ఆడటంతో ఓర్కాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓర్కాస్‌ ఇన్నింగ్స్‌లో షాయాన్‌ జహంగీర్‌ 43, క్లాసెన్‌ 27 (నాటౌట్‌), హెట్‌మైర్‌ 21, వార్నర్‌ 4, ఆరోన్‌ జోన్స్‌ 10 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకొని (4 ఓవర్లలో 64) 2 వికెట్లు తీశాడు.

 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు