Breaking News

బజ్‌బాల్‌ ఆడితే మాకే మంచిది.. రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ఖతం చేస్తాం: సిరాజ్‌

Published on Wed, 01/24/2024 - 21:12

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు హైదరాబాద్‌ వేదికగా గురువారం(జనవరి 25) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్‌ అయితే మ్యాచ్‌కు ఒక రో​జే ముందే తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. అనూహ్యంగా ఇంగ్లీష్‌ జట్టు కేవలం ఒకే ఒ​‍క స్పెషలిస్ట్‌ పేస్‌ బౌలర్‌తో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టుకు వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ దూరమయ్యాడు. స్పీడ్‌ స్టార్‌ మార్క్‌ వుడ్‌కు తుది జట్టులో ఇంగ్లండ్‌ మేనెజ్‌మెంట్‌ ఛాన్స్‌ ఇచ్చింది.

ఇక మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్‌బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్‌ జట్టుకు కష్టాలు తప్పవు అని సిరాజ్ హెచ్చరించాడు. "ఒక వేళ ఇంగ్లండ్‌ భారత పరిస్థితుల్లో బజ్‌బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుంది.

ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదు. బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్‌ అవుతోంది. మరి కొన్ని సార్లు స్ట్రైట్‌గా వస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌ బజ్‌ బాల్‌ ఆడితే మాకే మంచిది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా ముగుస్తుందని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)