Breaking News

ICC rankings: రఫ్ఫాడించిన సిరాజ్‌.. ఏకంగా 12 స్థానాలు జంప్

Published on Wed, 08/06/2025 - 15:19

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచిన టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్‌లోనూ స‌త్తాచాటాడు. సిరాజ్ మియా త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ర్యాంక్‌ను సాధించాడు. సిరాజ్‌ 674 రేటింగ్ పాయింట్లతో  ఏకంగా 12 స్ధానాలు ఎగ‌బాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ హైద‌రాబాదీ టెస్టు బౌల‌ర్ల ర్యాకింగ్స్‌లో టాప్ 15లో చోటు ద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి.

దుమ్ములేపిన సిరాజ్‌..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ భార‌త ఫాస్ట్ బౌల‌ర్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ముఖ్యంగా ఓవ‌ల్ టెస్టులో టీమిండియా చారిత్ర‌త్మ‌క విజ‌యం సాధించ‌డంలో సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆఖ‌రి టెస్టులో సిరాజ్ తొమ్మది వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్‌కు మరుపురాని విజ‌యాన్ని అందించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 23  సిరాజ్ వికెట్లతో స‌త్తాచాటాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.

ప్ర‌సిద్ద్ అదుర్స్‌..
ఇక ఓవ‌ల్ టెస్టులో సిరాజ్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన ప్ర‌సిద్ద్ కృష్ణ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రసిద్ద్ ఐదో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను కృష్ణ సాధించాడు. కాగా బౌలర్ల ర్యాకింగ్స్‌లో  టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా(889) అగ్రస్దానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడ రెండో స్దానంలో నిలిచాడు.

టాప్‌-5 లోకి జైశ్వాల్‌..
ఇక ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ టాప్ 5లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచ‌రీతో మెరిశాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల‌లో విఫ‌ల‌మైన శుబ్‌మ‌న్ గిల్ నాలుగు స్ధానాలు దిగ‌జారి 13వ ర్యాంక్‌కు ప‌డిపోయాడు.
చదవండి: IND vs ENG: వ్యాజ్‌లెన్‌ వాడారు.. గిల్‌ సేనపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)