Breaking News

టీమిండియాలో నో ఛాన్స్‌.. మహ్మద్ షమీ కీలక నిర్ణయం

Published on Thu, 11/20/2025 - 12:44

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు శర్వశక్తుల ప్రయత్నిస్తున్నాడు. షమీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు సవాల్ విసిరేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఆడనున్నాడు.

ఇప్పటికే తన నిర్ణయాన్ని బెంగాల్ క్రికెట్ అసోయేషిన్‌కు షమీ తెలియజేసినట్లు రేవ్ స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది. మహ్మద్ షమీ భారత తరపున చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. 

ఆసియాకప్‌తో పాటు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరగుతున్న టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి తనను పట్టించుకోకపోవడం పట్ల షమీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

కావాలనే ఎంపిక చేయడం లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌ను ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ పరోక్షంగా విమర్శించాడు. అగార్కర్ మాత్రం ఫిట్ నెస్ సమస్యల కారణంగానే షమీని ఎంపిక చేయడం లేదని మరోసారి స్పష్టం చేశాడు.

రంజీల్లో అదుర్స్‌..
ప్ర‌స్తుత రంజీ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు బెంగాల్ త‌ర‌పున నాలుగు మ్యాచ్‌లు ఆడిన ష‌మీ.. 20 వికెట్లు పడగొట్టాడు. అత‌డు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా బెంగాల్ జ‌ట్టు గ్రూప్-సిలో అగ్ర‌స్ధానంలో ఉంది. ఇక వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో ష‌మీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ.10 కోట్లకు లక్నో ట్రేడ్‌ చేసుకుంది.
చదవండి: గంభీర్‌ మాస్టర్‌ ప్లాన్‌తో వాళ్లకు చెక్‌!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్‌?

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)