Breaking News

పాకిస్తాన్‌ సెలెక్షన్‌ కమిటీ నుంచి వైదొలిగిన మొహమ్మద్‌ యూసఫ్‌

Published on Sun, 09/29/2024 - 17:01

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ జాతీయ సెలెక్షన్‌ కమిటీ నుంచి మొహమ్మద్‌ యూసఫ్‌ వైదొలిగాడు. ఈ విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది. బోర్డులో ఇతర బాధ్యతలపై ఫోకస్‌ పెట్టేందుకు సెలెక్షన్‌ కమిటీ నుంచి వైదొలిగినట్లు యూసఫ్‌ తెలిపాడు. యూసఫ్‌ సెలెక్షన్‌ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 

యూసఫ్‌ సెలెక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు పీసీబీ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ రెండు బాధ్యతలతో పాటు యూసఫ్‌ మరో కీలక పదవిలోనూ కొనసాగుతున్నాడు. అతను పాకిస్తాస్‌ అండర్‌-19 జట్టుకు హెడ్‌ కోచ్‌గా పని చేస్తున్నాడు. అతని ఆథ్వర్యంలో పాక్‌ ఈ ఏడాది మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో మూడో స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌ త్వరలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడబోతుంది. స్వదేశంలో జరుగబోయే ఈ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ ఇప్పటికే ప్రాక్టీస్‌ షురూ చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు ముల్తాన్‌ వేదికగా.. మూడో టెస్ట్‌ రావల్పిండి వేదికగా జరుగనున్నాయి. పాక్‌ ఇటీవలి కాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఆ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌ చేతిలో టెస్ట్‌ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు పాక్‌ టీ20 వరల్డ్‌కప్‌లో పసికూన యూఎస్‌ఏ చేతిలో ఘెర పరాభవాన్ని ఎదుర్కొంది. 

చదవండి: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్‌

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు