Breaking News

ఏంటి రిజ్వాన్ ఇది.. జ‌ట్టు నుంచి తీసేసినా మార‌వా? వీడియో

Published on Fri, 08/22/2025 - 12:59

పాకిస్తాన్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఆసియాక‌ప్ జ‌ట్టులో చోటు కోల్పోవ‌డంతో రిజ్వాన్ క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే రిజ్వాన్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశ‌పరిచాడు.

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రిజ్వాన్‌.. శుక్ర‌వారం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. కీల‌క స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిజ్వాన్ బార్బోడ‌స్ స్పిన్న‌ర్ వారిక‌న్ బౌలింగ్ చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఏంటి రిజ్వాన్ జ‌ట్టు నుంచి తీసేసినా మార‌వా అంటే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రిజ్వాన్ గ‌త కొంత కాలంగా పేలవ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.

గ‌త ఆరు ఇన్నింగ్స్‌ల‌లో రిజ్వాన్ చేసిన స్కోర్లు ఇవి  0, 16, 53, 4, 17,0. 12 పరుగుల తేడాతో సెయింట్‌ కిట్స్‌ విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్‌ జాసెన్‌ హెల్డర్‌ది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 

సెయింట్స్‌ కిట్స్‌ బ్యాటర్లలో కైల్‌ మైర్స్‌(42), హోల్డర్‌(38), ఫ్లెచర్‌(25) రాణించారు. బార్బోడస్‌ బౌలర్లలో రిమాన్‌ సిమాండ్స్‌ మూడు, డానియల్‌ సామ్స్‌ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు వారికన్‌, బాష్‌ ఒక వికెట్‌ సాధించారు.

నిప్పులు చెరిగిన హోల్డర్‌
అనంతరం 175 పరుగుల లక్ష్య చేధనలో బార్బోడస్‌ 18.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జాసన్‌ హోల్డర్‌ 4 వికెట్లు పడగొట్టి బార్బోడస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు నసీం షా, నావియన్ బిడైసీ తలా రెండు వికెట్లు సాధించారు. బార్బోడస్‌ బ్యాటర్లలో కదీమ్ అల్లెన్(42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)