Breaking News

తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్‌ క్రికెటర్‌ భవితవ్యం!

Published on Thu, 05/04/2023 - 20:28

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌ మహ్మద్‌ నవాజ్‌ వేశాడు. ఓవర్‌ తొలి బంతిని డారిల్‌ మిచెల్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్‌ చేతి వేలికి తగిలింది.

బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్‌ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్‌ బ్రేక్‌ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్‌-రే తీయించారు. కాగా రిపోర్ట్‌ ఇంకా రావాల్సి ఉంది.

గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్‌ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్‌ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌ వేసే చాన్స్‌ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పాకిస్తాన్‌ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌కు 2011 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ గెలవడం  మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌ 90, బాబర్‌ ఆజం 54 పరుగులతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్‌ కావడంతో పాక్‌ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్‌ బ్లండల్‌ 65, కొల్‌ మెక్‌నికొంచి 64, టామ్‌ లాథమ్‌ 45 పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, మహ్మద్‌ వసీమ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: ఐపీఎల్‌లో 16 సీజన్‌లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు