Breaking News

మొయిన్‌ అలీపై నిషేధం..!

Published on Thu, 03/05/2026 - 09:07

ఇంగ్లండ్ వెటరన్‌ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్‌ లీగ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్‌ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు. నాలుగు సీజన్ల పాటు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు నాయకత్వం వహించిన మొయిన్‌కు ఈ అవమానం జరగడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. 

ఇందులో మొదటిది.. అతను పాక్‌ ఆటగాళ్లకు మద్దతు తెలపడం​. ఈసారి హండ్రెడ్ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై షాడో బ్యాన్‌ ఉంది. ఈ లీగ్‌లో మెజార్టీ ఫ్రాంచైజీలను భారతీయులు, ముఖ్యంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు చేజిక్కించుకోవడంతో పాక్‌ ఆటగాళ్లను తీసుకోకూడదని అనధికారిక నిర్ణయం జరిగింది. 

ఇలా జరగడాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌తో పాటు మొయిన్‌ అలీ కూడా వ్యతిరేకించాడు. ECB వివక్షకు వ్యతిరేకంగా కట్టుబడి ఉందని నమ్ముతున్నంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికాలో జరిగిన జాతి వివక్షను ఉదాహరించి, ఇప్పుడు అదే విధమైన వివక్ష పాకిస్తాన్ ఆటగాళ్లపై జరుగుతోందని వ్యాఖ్యానించాడు. పాక్‌ ఆటగాళ్లకు మద్దతుగా మొయిన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే అతన్ని ఏ హండ్రెడ్‌ లీగ్‌ ఫ్రాంచైజీ నామినేట్‌ చేయకపోవడానికి కారణంగా తెలుస్తుంది.

మరి​న్ని కారణాలు..

గత నిర్ణయాలు: గత సీజన్‌లో మొయిన్‌ CPL కోసం హండ్రెడ్‌ లీగ్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఈ చర్య లీగ్‌ పట్ల అతని కమిట్‌మెంట్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. అందుకే ఏ ఫ్రాంచైజీ అతన్ని నామినేట్‌ చేయలేదు. 

వేలం ధర: మొయిన్‌ బేస్ ప్రైస్ £75,000 ఉండటం ఫ్రాంచైజీలను వెనక్కి తగ్గేలా చేసింది.  

వయసు: సీజన్ ప్రారంభ సమయానికి అతని వయసు 39 ఏళ్లు అవుతుంది.  

నిలకడలేమి: మొయిన్‌ను ఈ సీజన్‌లో హండ్రెడ్‌ ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి మరో కారణం అతని నిలకడలేమి. మొయిన్‌ కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇతర లీగ్‌లలో ఆడేందుకు NOCలు పొందాడు. 

అయితే, ఇటీవల అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని యార్క్‌షైర్ తరఫున T20 బ్లాస్ట్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నిలకడలేమే అతనికి మరో మైనస్‌గా మారింది.

తలుపులు మూసుకుపోలేదు 
మొయిన్‌కు హండ్రెడ్ లీగ్‌ 2026 తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. జూన్‌లో జరిగే వైల్డ్ కార్డ్ సైనింగ్స్ ద్వారా అవకాశం లభించవచ్చు. ప్రతి ఫ్రాంచైజీ T20 బ్లాస్ట్ ప్రదర్శన ఆధారంగా £31,000 కాంట్రాక్ట్‌తో ఇద్దరు ఆటగాళ్లను వైల్డ్ కార్డ్  ద్వారా ఎంపిక చేసుకుంటుంది. యార్క్‌షైర్ తరఫున మంచి ప్రదర్శన చేస్తే మొయిన్ మళ్లీ హండ్రెడ్ లీగ్‌లో కనిపించే అవకాశం ఉంది.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)