Breaking News

‘మీ కాంతివంతమైన చర్మ రహస్యమేంటి’

Published on Fri, 11/07/2025 - 03:08

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌ కప్‌ విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. బుధవారం తనను కలిసిన క్రికెటర్లను అభినందించిన ఆయన వారితో పలు అంశాలు మాట్లాడారు. ఇందులో బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ అడిగిన ప్రశ్న ఒక్కసారిగా నవ్వులు పూయించింది. ప్రధాని చర్మ సంరక్షణ గురించి నేరుగా ప్రధానినే హర్లీన్‌ అడిగేసింది. 

‘మీ చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకోవాలని ఉంది. మీ చర్మం చాలా మెరుస్తూ ఉంటుంది’ అని హర్లీన్‌ చెప్పింది. దానిపై ప్రధాని కూడా స్పందించారు. ‘నేను ఎప్పుడూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు’ అని ఆయన బదులిచ్చారు. జట్టులోని ఇతర సభ్యులతో కూడా మోదీ విభిన్న అంశాలపై మాట్లాడి వారి స్పందనను తెలుసుకున్నారు. 

దీప్తి శర్మ చేతిపై ఉన్న హనుమంతుడి టాటూ గురించి, ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమె జైశ్రీరామ్‌ అని రాసుకోవడం గురించి కూడా మోదీ అడిగారు. తమ టీమ్‌లో ఐకమత్యం చాలా బలంగా ఉందని, ఎవరు మంచి ప్రదర్శన కనబర్చినా పరస్పరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని జెమీమా రోడ్రిగ్స్‌ వెల్లడించింది. గత జూన్‌లో ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సమయంలో తాము కింగ్‌ చార్లెస్‌తో ఫోటో దిగేందుకు అవకాశం రాగా, ప్రొటోకాల్‌ నిబంధనల కారణంగా సహాయక సిబ్బందికి అవకాశం దక్కలేదని హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ గుర్తు చేసుకున్నాడు. 

అయితే వరల్డ్‌ కప్‌ గెలిచి మన ప్రధానితో ఫోటో దిగుదామని ఆ రోజే తన సహచరులకు చెప్పి ఉత్సాహం నింపానని, అది ఈ రోజు వాస్తవంగా మారిందని అతను అన్నాడు. 2017లో తాము వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓడిన తర్వాత కూడా ప్రధానిని కలిశామని... ఇప్పుడు విజేతగా నిలిచి మళ్లీ వచ్చి గెలవడం సంతోషంగా ఉందని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. 

ఫైనల్లో చివరి క్యాచ్‌ అందుకొని బంతిని అపురూపంగా దాచుకోవడంపై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ను కూడా ప్రధాని అడగగా... ‘దేవుడే నేను చివరి క్యాచ్‌ అందుకునే అవకాశం ఇచ్చాడు. నేను దానిని ఊహించలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత దక్కిన విజయమిది. అందుకే ఆ బంతిని నాతోనే ఉంచుకోవాలనుకున్నా’ అని హర్మన్‌ప్రీత్‌ స్పందించింది.   

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)