మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌ అకాల మరణం.. 18 ఏళ్లకే..!

Published on Mon, 01/09/2023 - 13:27

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MMA) ఫైటర్‌, అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (UFC) భవిష్యత్‌ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్‌లో పుట్టిన ఈ అప్‌కమింగ్‌ ఫైటర్‌ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్‌ మార్షల్‌ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్‌ బేస్‌డ్‌ ప్రమోటర్‌ వన్‌ ఛాంపియన్‌షిప్‌తో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్‌గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్‌ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్‌మీడియా సందేశాన్ని పెట్టింది.

విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్‌ మెక్‌ గ్రెగర్‌, ఖబీబ్‌, జాన్‌ జోన్స్‌, బ్రాక్‌ లెస్నర్‌ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్‌ రింగ్‌లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)