Breaking News

దంచికొట్టిన సీఎస్‌కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం

Published on Tue, 07/18/2023 - 10:28

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC 2023)లో టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సీఎస్‌కే తరపున అదరగొట్టిన డెవాన్‌ కాన్వే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తున్నాడు.

తాజాగా ముంబై న్యూయార్క్‌తో మ్యాచ్‌లో కాన్వే 55 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. మిచెల్‌ సాంట్నర్‌(27 పరుగులు) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై న్యూయార్క్‌ బౌలర్లలో బౌల్ట్‌, రబాడలు చెరో రెండు వికెట్లు తీయగా.. కీరన్‌ పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ షయాన్‌ జాహంగీర్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టిమ్‌ డేవిడ్‌ 24 పరుగులు చేశాడు. టెక్సస్‌ సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో మహ్మద్‌ మోషిన్‌, డేనియల్‌ సామ్స్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. రస్టీ థెరాన్‌, జియా ఉల్‌ హక్‌, డ్వేన్‌ బ్రావోలు తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: CWG 2026: 'అంత బడ్జెట్‌ మావల్ల కాదు'.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించలేం

Carlos Alcaraz: అల్‌కరాజ్‌ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)