Breaking News

చెలరేగిన నూర్‌ అహ్మద్‌.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్‌ కింగ్స్‌

Published on Tue, 06/17/2025 - 10:02

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్‌ 17) ఉదయం జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌కే సీయాటిల్‌ ఓర్కాస్‌ను 93 పరుగుల తేడాతో మట్టికరిపించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్‌ను టీఎస్‌కే బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా నూర్‌ అహ్మద్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

నూర్‌తో (4-0-18-3) పాటు జియా ఉల్‌ హక్‌ (3-0-16-3), నండ్రే బర్గర్‌ (3.5-1-10-3), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-4-1) చెలరేగడంతో ఓర్కాస్‌ 13.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఓర్కాస్‌ ఇన్నింగ్స్‌లో ఆరోన్‌ జోన్స్‌ (17), జస్దీప్‌ సింగ్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అంతలా టీఎస్‌కే బౌలర్లు ఓర్కాస్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓర్కాస్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాటర్లు డేవిడ్‌ వార్నర్‌ (9), కైల్‌ మేయర్స్‌ (0), స్టీవెన్‌ టేలర్‌ (4), హెన్రిచ్‌ క్లాసెన్‌ (0), సికందర్‌ రజా (4), సుజిత్‌ నాయర్‌ (5) హర్మీత్‌ సింగ్‌ (0), ఓబెద్‌ మెక్‌కాయ్‌ (3) దారుణంగా విఫలమయ్యారు.

అంతకుముందు సాయితేజ ముక్కామల్ల (30), మార్కస్‌ స్టోయినిస్‌ (28), డారిల్‌ మిచెల్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో టీఎస్‌కే గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. టీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాన్‌ కాన్వే (13), డుప్లెసిస్‌ (7), సావేజ్‌ (9) నిరాశపరిచారు. ఆఖర్లో మిలింద్‌ కుమార్‌ (18 నాటౌట్‌), శుభమ్‌ రంజనే (15 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు. 

ఓర్కాస్‌ బౌలర్లలో హర్మీత్‌ సింగ్‌, జస్దీప్‌ సింగ్‌ తలో 2 వికెట్లు తీయగా.. మెక్‌కాయ్‌, వకార్‌ సలాంఖీల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో టీఎస్‌కే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు స్కోర్లు చేసి అద్భుతంగా డిఫెండ్‌ చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో టీఎస్‌కే విజయాల్లో నూర్‌ అహ్మద్‌ కీలకపాత్ర పోషించాడు. 

ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఓ వికెట్‌ తీసిన నూర్‌.. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తాజాగా ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటిన నూర్‌ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 

నూర్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లోనూ ఇదే తరహా ప్రదర్శనలు (14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) చేసినప్పటికీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆశించిన విజయాలు సాధించలేకపోయింది. 2025 సీజన్‌లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు