హెడ్‌ మెరుపులు.. 88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్‌

Published on Wed, 07/17/2024 - 16:29

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్‌లో) నిలిచింది.

హెడ్‌, గౌస్‌, రచిన్‌ మెరుపులు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌.. ట్రవిస్‌ హెడ్‌ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్‌ గౌస్‌ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (8), మ్యాక్స్‌వెల్‌ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, కీరన్‌ పోలార్డ్‌ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్‌
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. వాషింగ్టన్‌ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్‌దీప్‌ సింగ్‌ 3.. మార్కో జన్సెన్‌, లోకీ ఫెర్గూసన్‌, మ్యాక్స్‌వెల్‌ తలో 2.. రచిన్‌ రవీంద్ర ఓ వికెట్‌ పడగొట్టారు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో రొమారియో షెపర్డ్‌ (25), ట్రెంట్‌ బౌల్ట్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)