Breaking News

స్టీవ్‌ స్మిత్‌ విధ్వంసం.. ట్రవిస్‌ హెడ్‌ మెరుపులు

Published on Tue, 07/23/2024 - 08:52

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌లో స్టీవ్‌ స్మిత్‌ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్‌.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లో స్మిత్‌కి ఇది వరసగా రెండో హాఫ్‌ సెంచరీ.

మరో ఎండ్‌లో ట్రవిస్‌ హెడ్‌ సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్‌ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్‌ కూడా మెరుపు హాఫ్‌ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో హెడ్‌కు ఇది మూడో హాఫ్‌ సెంచరీ.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్‌ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్‌ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. 

ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్‌, యూనికార్న్స్‌ తొలి రెండు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్‌ సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్‌ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)