Breaking News

పోలార్డ్‌ వీర బాదాడు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఇండియన్స్‌

Published on Mon, 07/22/2024 - 10:23

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. రషీద్‌ ఖాన్‌ (4-0-22-3), నోష్తుష్‌ కెంజిగే (4-0-22-2), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-2), రొమారియో షెపర్డ్‌ (4-0-30-1), కీరన్‌ పోలార్డ్‌ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్‌ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జేసన్‌ రాయ్‌ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ (15), స్పెన్సర్‌ జాన్సన్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్‌ నరైన్‌ (6), ఉన్ముక్త్‌ చంద్‌ (9), డేవిడ్‌ మిల్లర్‌ (6), సైఫ్‌ బదార్‌ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్‌ (0) నిరాశపరిచారు.

131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్‌ (12 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు. 

నైట్‌రైడర్స్‌ బౌలర్లలో నరైన్‌ 2, స్పెన్సర్‌ జాన్సన్‌, డ్రై, రసెల్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్‌ ఫ్రీడం, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)