Breaking News

మాథ్యూ వేడ్‌ వీరవిహారం.. రసెల్‌, నరైన్‌ మెరుపులు వృధా

Published on Wed, 07/19/2023 - 10:14

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2023 సీజన్‌లో భాగంగా లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌తో  ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యునికార్న్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్‌ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్‌ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్‌ ఫించ్‌ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌  తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్‌ రాయ్‌ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్‌ కుమార్‌ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌).. ఆఖర్లో  ఆండ్రీ రసెల్‌ (26 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్‌ నరైన్‌ (17 బంతుల్లో 28 నాటౌట్‌; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్‌ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రౌఫ్‌, బిష్ణోయ్‌, ఆండర్సన్‌ తలో వికెట్‌ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్‌ లీగ్‌లో హ్యాట్రిక్‌ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ సీజన్‌ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)