Breaking News

భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు

Published on Mon, 02/17/2025 - 03:50

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్‌’లో 1–2తో ఇంగ్లండ్‌ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (39వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

ఇంగ్లండ్‌–భారత్‌ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్‌ తరఫున పెయిజ్‌ గిలోట్‌ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్‌ (56వ నిమిషంలో) ఒక్కో గోల్‌ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించారు. 

తొలి ఐదు షాట్‌లు ముగిశాక  రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్‌లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్‌లో భారత ప్లేయర్‌ లాల్‌రెమ్‌సియామి గురి తప్పగా... ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సోఫీ హామిల్టన్‌ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)