Breaking News

Ashes Series 2nd Test: టాప్‌-5లోకి చేరిన మిచెల్‌ స్టార్క్‌

Published on Sun, 07/02/2023 - 11:17

స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆస్ట్రేలియా టాప్‌-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్‌ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్‌స్టర్‌ మిచెల్ జాన్సన్‌ను (73 టెస్ట్‌ల్లో 313 వికెట్లు) అధిగమించాడు.

ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ తొలి స్థానంలో (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), నాథన్‌ లయోన్‌ (122 టెస్ట్‌ల్లో 496 వికెట్లు), డెన్నిస్‌ లిల్లీ (70 టెస్ట్‌ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌  మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (50), బెన్‌ స్టోక్స్‌ (29) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్‌ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి.

స్కోర్‌ వివరాలు..
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌ (స్టీవ్‌ స్మిత్‌ 110, ట్రవిస్‌ హెడ్‌ 77, డేవిడ్‌ వార్నర్‌ 66; రాబిన్సన్‌ 3/100, టంగ్‌ 3/98)

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 325 ఆలౌట్‌ (డకెట్‌ 98, బ్రూక్‌ 50; స్టార్క్‌ 3/88, హెడ్‌ 2/17)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 279 ఆలౌట్‌ (ఖ్వాజా 77; బ్రాడ్‌ 4/65)

ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 114/4 (డకెట్‌ 50 నాటౌట్‌; కమిన్స్‌ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి)

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)