Breaking News

నిప్పులు చెరిగిన స్టార్క్‌

Published on Mon, 11/10/2025 - 18:14

యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ప్రత్యర్ధి ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ మెసేజ్‌ పంపాడు. యాషెస్‌ సన్నాహకాల్లో భాగంగా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ ఆడుతున్న అతడు (న్యూ సౌత్‌ వేట్స్‌).. విక్టోరియాపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు. తొలి రోజు ఆటలో ఇది జరిగింది.

ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్‌.. ఓపెనర్లు క్యాంప్‌బెల్‌ కెల్లావే (51), హ్యారీ డిక్సన్‌ (20) సహా కీలకమైన ఒలివర్‌ పీక్‌ (0), సామ్‌ హార్పర్‌ (54) వికెట్లు తీశాడు. స్టార్క్‌తో పాటు నాథన్‌ లియోన్‌ (22-1-65-2), సీన్‌ అబాట్‌ (18-1-70-1) కూడా రాణించడంతో న్యూ సౌత్‌ వేల్స్‌ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది.

ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది. కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ (36), సామ్‌ ఇలియట్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. న్యూ సౌత్‌ వేల్స్‌కే ఆడుతున్న మరో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ తొలి రోజు వికెట్‌ తీయలేకపోయాడు. హాజిల్‌వుడ్‌ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్‌ లేకుండా మిగిలాడు.

షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌ సహా ఆసీస్‌ జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.

ఇవాళే ప్రారంభమైన మరో మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టస్మానియా.. బ్రెండన్‌ డాగ్గెట్‌ (19.2-4-66-5), లియామ్‌ స్కాట్‌ (18-5-46-3), మెక్‌ ఆండ్రూ (16-2-54-1), థార్న్‌టన్‌ (10-2-31-1) ధాటికి 209 పరుగులకే ఆలౌటైంది. 

టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సిల్క్‌ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. యాషెస్‌ తొలి టెస్ట్‌ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్‌స్టర్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్‌స్వీని (2), జేసన్‌ సంఘా (12), ట్రవిస్‌ హెడ్‌ (9) ఔట్‌ కాగా.. హెన్రీ హంట్‌ (34), అలెక్స్‌ క్యారీ (25) క్రీజ్‌లో ఉన్నారు.  

చదవండి: బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)