Breaking News

గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

Published on Mon, 12/22/2025 - 13:52

యాషెస్ సిరీస్ 2025-26ను సొంతం చేసుకుని గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ త‌గిలింది. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి.

దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే మ్యాచ్ ముగిసిన లియోన్ క్రచెస్ (ఊత కర్రల) సహాయంతో నడుస్తూ కనిపించడం అందరిని షాక్‌కు గురిచేసింది. దీని బట్టి అతడి గాయం తీవ్రమైనదిగా పరిగణించవచ్చు. 

ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్‌ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడు తిరిగి వస్తే జాక్ వెదరాల్డ్‌పై వేటు పడే అవకాశముంది.

ఇక లియోన్ గాయంపై ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. "నాథన్ లియోన్‌కి ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడిది కీలక పాత్ర. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నాథన్ తిరిగి  రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లనున్నాడు.

గతంలో కూడా అతడి పిక్క గాయం కారణంగా రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కాబట్టి ఎలా కోలుకోవాలన్నదానిపై అతడికి అవగాహన ఉంది. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు తన సేవలను అతడు అందించాలనుకుంటున్నాడు. నాథర్ వేగంగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాను" అని స్టార్క్ పేర్కొన్నాడు. 

మూడో టెస్టులో లియోన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఓటమిని శాసించాడు. కాగా తొలి మూడు టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్‌ సిరీస్‌ను 3-0 తేడాతో రిటైన్‌ చేసుకుంది.
చదవండి: పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌!.. అసలు కప్పు గెలిస్తే ఇంకేమైనా ఉందా?

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)