అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డ‌కౌట్‌

Published on Sun, 05/18/2025 - 16:47

ఆస్ట్రేలియా య‌వ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ ఓవెన్ త‌న ఐపీఎల్ కెరీర్‌ను పేల‌వంగా ఆరంభించాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే త‌న తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

కేవ‌లం రెండు బంతులు మాత్ర‌మే ఎదుర్కొని ఖాతా తెర‌వ‌కుండానే మిచెల్ పెవిలియ‌న్‌కు చేరాడు. రాజ‌స్తాన్ యువ పేస‌ర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంస‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియ‌న్‌కు చేరాడు. కాగా మ‌రో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ స్ధానంలో పంజాబ్ జ‌ట్టులోకి ఓవెన్ వ‌చ్చాడు.

ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు మాక్సీ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్ల‌కు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆట‌గాడిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం త‌న మొద‌టి మ్యాచ్‌లోనే తుస్సుమ‌న్పించాడు.

అంత‌కంటే ముందు మాక్స్‌వెల్ సైతం ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వ‌చ్చిన ఓవెన్ కూడా అదే తీరును క‌న‌బ‌రిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌక‌టైన ఓవెన్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. మ‌రో మాక్స్‌వెల్ జ‌ట్టులోకి వ‌చ్చాడ‌ని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా  ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.

ఈ టాస్మానియా ఆల్‌రౌండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి  646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్‌ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జ‌ట్టులో చేర‌క‌ముందు ఓవెన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్‌ జల్మీకి ప్రాతినిథ్యం వ‌హించాడు. ఐపీఎల్ నుంచి ఆఫ‌ర్ రావ‌డంతో పీఎస్ఎల్ మ‌ధ్య‌లోనే అత‌డు వైదొలిగాడు.



 

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)