Breaking News

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

Published on Sun, 06/21/2026 - 08:47

అమెరికా వేదిక‌గా జ‌రుగుతున్న మేజ‌ర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ 2026) టోర్నీలో రికార్డులు బ‌ద్ద‌లవుతున్నాయి. ఆదివారం ముంబై న్యూయార్క్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ ఓపెన‌ర్ మిచెల్ ఓవెన్ 68 బంతుల్లోనే 155 ప‌రుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన అత‌డి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 13 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం. 

మిచెల్ ఓవెన్ దెబ్బ‌కు ముంబై న్యూయార్క్ బౌల‌ర్లంద‌రూ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 245 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ ఓవెన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ మిన‌హా మిగతా బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేదు. 

కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27), మార్క్ చాప్‌మ‌న్ (23) ప‌ర్వాలేద‌నిపించారు. ముంబై న్యూయార్క్ బౌల‌ర్లలో బౌల్ట్‌, కార్బిన్ బోష్‌, షెప‌ర్డ్‌, ఉగ‌ర్క‌ర్‌, కోరె అండ‌ర్స‌న్ త‌లా ఒక వికెట్ తీశారు. అనంత‌రం 246 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబై న్యూయార్క్ 5 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి 45 ప‌రుగులు చేసి ఓట‌మి దిశ‌గా ప‌యనిస్తోంది. ముంబై న్యూయార్క్ విజ‌యానికి 89 బంతుల్లో 201 ప‌రుగులు అవ‌స‌రం. క్రీజులో పొలార్డ్ (10), అండ‌ర్స‌న్  ఉన్నారు.

కాగా ఆస్ట్రేలియా త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక స్కోరు బాదిన రెండో క్రికెట‌ర్‌గా మిచెల్ ఓవెన్ నిలిచాడు. ఓవెన్ కంటే ముందు ఆరోన్ ఫించ్ (2013లో 156 ప‌రుగులు, 2018లో 175 ప‌రుగులు) రెండు అత్య‌ధిక స్కోర్ల‌తో ముందున్నాడు. 24 ఏళ్ల ఓవెన్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: చిన్న జ‌ట్టు సంచ‌ల‌నం.. ఈక్వెడార్‌కు భారీ షాక్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)