Breaking News

ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ ఉగ్రరూపం

Published on Thu, 01/01/2026 - 16:29

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఉ‍గ్రరూపం దాల్చాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ 2025-26లో భాగంగా పెర్త్‌ స్కార్చర్స్‌కు ఆడుతూ హోబర్ట్‌ హరికేన్స్‌పై విధ్వంసకర శతకం బాదాడు. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఓవరాల్‌గా 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మార్ష్‌కు ఇది రెండో శతకం. మార్ష్‌ తన తొలి బీబీఎల్‌ శతకాన్ని కూడా హోబర్ట్‌ హరికేన్స్‌పైనే చేశాడు.

తాజా ప్రదర్శనలో భాగంగా మార్ష్‌ 2000 బీబీఎల్‌ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. మిచెల్‌ ఓవెన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ ల్యాండ్‌ మార్క్‌ను చేరుకున్నాడు. 2011-12 ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మార్ష్‌.. బీబీఎల్‌ కెరీర్‌లో 76 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పైచిలుకు పరుగులు చేశాడు.

తాజా మ్యాచ్‌లో మార్ష్‌తో పాటు ఆరోన్‌ హార్డీ కూడా చెలరేగాడు. హార్డీ కేవలం​ 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో హార్డీ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు.  వరుసగా 5 బౌండరీలు, సిక్సర్‌ బాదాడు. 

మార్ష్‌ సైతం 14వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. వరుసగా 4,6,6,4 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌, హార్డీ కలిపి 20 బౌండరీలు, 10 సిక్సర్లు బాదారు. వీరి ఊచకోత ధాటి​కి స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

మిగతా స్కార్చర్స్‌ బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌ 16, కూపర్‌ కన్నోలీ 4, టర్నర్‌ 1 (నాటౌట్‌) పరుగులు చేశారు. హరికేన్స్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌ 2, మిచెల్‌ ఓవెన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్‌ తడబడుతుంది. 9 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. టిమ్‌ వార్డ్‌ (27), మిచెల్‌ ఓవెన్‌ (4), మాకలిస్టర్‌ రైట్‌ (16), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (18) ఔట్‌ కాగా.. నిఖిల్‌ చౌదరి (17), మాథ్యూ వేడ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. స్కార్చర్స్‌ బౌలర్లలో జోయల్‌ పారిస్‌, ఆరోన్‌ హార్డీ, ఆస్టన్‌ అగర్‌, బ్రాడీ కౌచ్‌కు తలో వికెట్‌ దక్కింది.ఈ మ్యాచ్‌లో హరికేన్స్‌ గెలవాలంటే 66 బంతుల్లో 154 పరుగులు చేయాలి.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ జట్టుకు నాయకుడిగా మిచెల్‌ మార్ష్‌ను కొనసాగించారు.

టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)