Breaking News

కోహ్లి, రోహిత్‌ ఔటైతే చాలు.. ఐపీఎల్‌ ఆడితే సరిపోదు! పాకిస్తానే ఫేవరేట్‌

Published on Wed, 08/30/2023 - 14:05

ఆసియాకప్‌-2023 బుధవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌-నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తమ ఆసియాకప్‌ ప్రయణాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్‌2న కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది.

ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు భారత జట్టును టార్గెట్‌ చేస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ కీలక వాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో  రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి మినహా అంత గొప్ప ఆటగాళ్ల లేరని భట్‌ మరోసారి విషం చిమ్మాడు.

"భారత జట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటు యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు చాలా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. ముఖ్యంగా ఇటువంటి హై వోల్టేజ్‌ మ్యాచ్‌ల్లో ఒత్తడిని తట్టుకోలేరు. విరాట్‌ కోహ్లి లేదా రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆడినప్పుడే భారత్‌ చాలా సార్లు  గెలుపొందింది.

మిగితా ఆటగాళ్లు బాధ్యత తీసుకుని ఆడినప్పుడు టీమిండియా గెలవడానికి చాలా కష్టపడింది. టీమిండియా బ్యాటింగ్‌ పరంగా చాలా బలహీనంగా ఉంది. పాక్‌ బౌలర్లు కోహ్లి, రోహిత్‌ వంటి రెండు పెద్ద వికెట్లను పడగొడితే సగం మ్యాచ్‌ గెలిచనట్లే.

అదే పాకిస్తాన్‌లో బాబర్‌,  రిజ్వాన్, ఫఖర్, షాదాబ్, షాహీన్, హరీస్ రవూఫ్ వంటి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. ప్రస్తుత పాకిస్తాన్‌ జట్టు చాలా అద్భుతంగా ఉంది. నా వరకు అయితే పాకిస్తాన్‌ టైటిల్‌ ఫేవరేట్‌" అని తన యూట్యూబ్‌ ఛానల్‌లో భట్‌ పేర్కొన్నాడు.
చదవండితిలక్‌ వర్మకు చోటు దక్కడం చాలా సంతోషం: విజయ్ దేవరకొండ

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)