Breaking News

ఆసీస్ క్రికెట్ బోర్డు బిగ్ డెసిషన్.. మైఖల్‌ హస్సీకి కీలక బాధ్యతలు

Published on Fri, 11/06/2026 - 19:30

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, 'మిస్టర్ క్రికెట్'గా పేరుగాంచిన మైఖేల్ హస్సీకి క్రికెట్ ఆస్ట్రేలియా  కీలక బాధ్యతలు అప్పగించింది. జట్టు కన్సల్టెంట్ కోచ్‌తో పాటు T20 సలహాదారుడిగా ఆయనను నియమిస్తున్నట్లు బోర్డు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచి మైక్ హస్సీ తన నూతన బాధ్యతలను స్వీకరించనున్నాడు.

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్సీని కోచింగ్ సెటప్‌లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు సహకారంగా హస్సీ కోచింగ్ సేవలందించనున్నాడు.

తన నియామకంపై మైక్ హస్సీ సంతోషం వ్యక్తం చేస్తూ .. "ఆస్ట్రేలియా జట్టులో  కీలకమైన పాత్ర పోషించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇటీవలి కాలంలో మా జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. రాబోయే సవాళ్లతో కూడిన సిరీస్‌లలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి నా వంతు సహాయపడతానని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.

కాగా హస్సీ మొన్నటివర​కు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలిందించాడు. అయితే ఐపీఎల్‌-2027కు ముందు తన బాధ్యతలను నుంచి హస్సీ తప్పుకొన్నాడు. ఇదే సమయంలో హస్సీకి ఇంగ్లండ్ టెస్టు కోచింగ్ బృందంలో చేరాలని హెడ్ కోచ్ స్టీపెన్‌ ఫ్లెమింగ్ నుండి ఆఫర్ వచ్చింది. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌కే సేవలు అందించాలనే ఉద్దేశంతో హస్సీ దానిని తిరస్కరించాడు.
చదవండి: మీ అమ్మ చచ్చిపోతుంది!.. వాళ్లంతా మూర్ఖులు, టాక్సిక్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)