Breaking News

'భార‌త జ‌ట్టుకు ఫీల్డింగ్ కోచ్‌ను నేనే'.. టీమిండియాపై మైఖేల్ వాన్‌ సెటైర్లు

Published on Wed, 06/25/2025 - 09:12

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా(Teamindia) ఓట‌మి పాలైంది. 371 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కాపాడుకోవ‌డంలో భార‌త బౌల‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. ఆఖ‌రి రోజు ఆట‌లో బౌల‌ర్లు తేలిపోయారు. దీంతో ఈ భారీ టార్గెట్‌ను ఇంగ్లండ్ కేవ‌లం ఐదు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది.

ఇంగ్లండ్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్(149) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ విజ‌యంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లీష్ జ‌ట్టు దూసుకెళ్లింది. కాగా భార‌త్ ఓట‌మికి ప్ర‌ధానం కార‌ణం ఫీల్డింగ్ వైఫ‌ల్య‌మే. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 6 క్యాచ్‌ల‌ను భార‌త ఫీల్డ‌ర్లు జార‌విడిచారు.

ఆఖ‌రి రోజు ఆట‌లో సైతం టీమిండియా ఫీల్డింగ్ ఏ మాత్రం మెరుగుప‌డ‌లేదు. ఆఖ‌రి రోజు ఆట‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌ బెన్ డ‌కెట్ క్యాచ్‌ను 97 ప‌రుగుల వ‌ద్ద‌ జైశ్వాల్ విడిచిపెట్టాడు. దీంతో అత‌డు ఏకంగా 149 ప‌రుగులు చేసి ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ క్ర‌మంలో పేలవ ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన టీమిండియాను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌(Michael Vaughan) ట్రోలు చేశాడు. "ఈ భార‌త జ‌ట్టుకు ఫీల్డింగ్ కోచ్‌ను నేనే అని ప్ర‌క‌టిస్తున్నాను. నా ఫీల్డింగ్ ఆకాడమీ ప్రస్తుతం బాగా రాణిస్తోంది" అని అని సెటైరిక‌ల్ ట్వీట్ చేశాడు.

 అతడికి భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. గతంలో వాన్ క్యాచ్‌లు విడిచిపెట్టిన వీడియోలను ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు.  గ‌తంలో వాన్‌ త‌న సొంత జట్టును కూడా విధంగానే ట్రోలు చేశాడు. ఇక ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్‌



 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)