Breaking News

వాళ్లతో పోలిస్తే ఐపీఎల్‌లో క్రికెటర్లు సంపాదించేదెంత.. ఆడుకోనివ్వండి..!

Published on Mon, 06/26/2023 - 13:59

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ స్పందించాడు. ఈ విషయంలో లాయిడ్‌ ఐపీఎల్‌ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు.

ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్‌ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు.

మైఖేల్‌ జోర్డన్‌ లాంటి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్‌లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్‌ లాయిడ్‌ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌ అన్న విషయం తెలిసిందే.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)