Breaking News

T20 WC 2024: ఆసీస్‌, ఇంగ్లండ్‌ కాదు.. ఆ జట్టే పెను ప్రమాదకారి..!

Published on Fri, 05/31/2024 - 13:11

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ ఆశాజనకమైన జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలో భారత్‌ పెను ప్రమాదకారిగా మారబోతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు టీమిండియా నుంచి ముప్పు పొంచి ఉంటుందని అన్నాడు. భారత్‌.. ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బ​ తీయవచ్చని అంచనా వేశాడు. ఓవరాల్‌గా టీమిండియాకే ఈసారి టైటిల్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ బ్యాటర్లలో ట్రవిస్‌ హెడ్‌ నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశిస్తున్నట్లు తెలిపాడు.

క్లార్క్‌ ఓ పక్క టీమిండియాను గొప్పగా చూపుతూనే భారత సెలెక్టర్లు ఓ విషయంలో పెద్ద సాహసం చేశారని అన్నాడు. ప్రపంచకప్‌ జట్టుకు నలుగురు స్పిన్నర్లను (జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, చహల్‌) ఎంపిక చేయడం ద్వారా టీమిండియా స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడుతుందన్న సందేశాన్ని పంపారని అన్నాడు. క్లార్క్‌కు ముందు చాలామంది దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ సారి టీమిండియానే టైటిల్‌ నెగ్గుతుందని జోస్యం చెప్పారు. మరి రియల్టీలో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2024 ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్‌ ప్రస్తానం జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్‌ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. మరోవైపు ఆసీస్‌ సైతం జూన్‌ 5నే తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. బార్బడోస్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆసీస్‌.. ఒమన్‌తో తలపడుతుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)