ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. ఐపీఎల్‌ నుంచి అతడు అవుట్‌

Published on Thu, 05/01/2025 - 12:27

రాజస్తాన్‌ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్‌ విఘ్నేశ్‌ పుతూర్‌ (Vignesh Puthur) ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రం
కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్‌ పుతూర్‌ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్‌ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్‌ పుతూర్‌ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.

గాయం కారణంగా దూరం
అయితే, ఇటీవల విఘ్నేశ్‌ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ రఘు శర్మను తీసుకుంది.

ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్‌ పుతూర్‌ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్‌ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.

రఘు శర్మ ధర రూ. 30 లక్షలు
కాగా ముంబై నెట్‌ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్‌ పుతూర్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్‌... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్‌ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌!

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)