Breaking News

బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..

Published on Wed, 05/14/2025 - 16:18

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మెహిదీ హ‌స‌న్ మీరాజ్‌కు తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను మెహిదీ హ‌స‌న్‌కు ఈ అవార్డు దక్కింది. గ‌త నెలలో సొంత‌గ‌డ్డ‌పై జింబాబ్వేతో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మెహిదీ హ‌స‌న్ ఆల్ రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు.

ఈ సిరీస్‌లో 27 ఏళ్ల మెహిదీ 116 పరుగుల‌తో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్ర‌మంలో ఐసీసీ  ప్రతిష్టాత్మక అవార్డు మిరాజ్‌కు వ‌రించింది. ఈ అవార్డు సాధించిన మూడవ బంగ్లాదేశ్ ఆటగాడిగా మెహిదీ నిలిచాడు. అత‌డి కంటే ముందు వెట‌ర‌న్ ఆట‌గాళ్లు ముష్పిక‌ర్ రహీం, ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఈ అవార్డును అందుకున్నారు.

కాగా ఈ అవార్డు కోసం మెహిదీ హ‌స‌న్‌తో పాటు జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీ, బెన్ సియ‌న్స్ పోటీ ప‌డ్డారు. అయితే  వీరిద్దిరికంటే మెహిదీ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. మ‌రోవైపు మ‌హిళ‌ల విభాగంలో ఈ అవార్డును స్కాట్లాండ్ కెప్టెన్ కాథరిన్ బ్రైస్ సొంతం చేసుకుంది. 

గ‌త నెల‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో కాథ‌రిన్ బ్రైస్.. బ్యాట్‌, బంతితో అద్బుతంగా రాణించింది. 293 ప‌రుగుల‌తో టోర్న‌మెంట్ లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచిన బ్రైస్‌.. బౌలింగ్‌లోనూ 6 వికెట్లు ప‌డ‌గొట్టింది. దీంతో వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్‌, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానాను వెన‌క్కి నెట్టి ఈ అవార్డును కాథ‌రిన్ సొంతం చేసుకుంది.
చ‌ద‌వండి: IPL 2025: ఐపీఎల్‌ రీ స్టార్ట్‌.. ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌ న్యూస్‌!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)